top of page
MediaFx

పండుగ రోజు గుడ్ న్యూస్ చెప్పిన బెల్లంకొండ..

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ నటుడు తన సోషల్ మీడియా ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను చేయబోయే సినిమాల గురించి వెల్లడించారు. ఈ హీరో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ తో పాటు మూన్ షైన్ పిక్చర్స్ తో మరో రెండు ప్రాజెక్టుల కోసం చేతులు కలిపినట్టు తెలిపాడు.

శ్రీనివాస్ ని మునుపెన్నడూ చూడని అవతారాల్లో, ఒక్కొక్కటి ఒక ప్రత్యేకమైన కథాంశంతో ప్రెజెంట్ చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. ఈ సినిమాలు కచ్చితంగా ఫ్యాన్స్ ఎంటర్ టైన్ చేస్తాయని ధీమాతో చెబుతున్నాడు. అయితే టాలీవుడ్ రేసులో కాస్త వెనుకపడిన బెల్లంకొండ ఈ రెండు సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫిక్ష్ అయ్యాడు. ఇతర హీరోలకు భిన్నంగా వైవిధ్యమైన పాత్రలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ హీరో. అయితే  ఈ ప్రాజెక్టులే కాకుండా మరో పెద్ద ప్రాజెక్టుతో మూవీ ఉండబోతుందని రివీల్ చేశాడు ఈ హీరో.

బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఓరియెంటెడ్, కంటెంట్ ఆధారిత కథలతో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ హీరో సినిమాలకు హిందీలో ప్రత్యేకంగా అభిమానులు ఉండటంతో బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తారుగా ఆడటంతో మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేసేందుకు బిజీ అయ్యాడు.




bottom of page