top of page
Shiva YT

🚀🌙 జాబిల్లి యాత్రలో ‘చిత్తూరు’ కల్పన.. 🛰️🌌

🌆 చిత్తూరు జిల్లా, ఆగస్టు 25: దేశం గర్వించేలా చేసిన చంద్రయాన్ 3 ప్రయోగంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వనిత కూడా భాగస్వామ్యం ఉంది. 🙌🌕 చంద్రయాన్-3 లో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కీలకపాత్ర పోషించిన కల్పన మన్ననలు పొందింది. 👩‍🚀🛰️

చిత్తూరు జిల్లాలోని నగరి మండలం తడుకు పేటకు చెందిన కల్పన చంద్రయాన్ 3 ఉపగ్రహం జాబిల్లికి సేఫ్‌గా చేరడంతో సొంతూరి కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగింది. 🌠✨ కల్పన విషయానికి వస్తే తండ్రి మునిరత్నం చెన్నై హైకోర్టులో అధికారి కావడంతో ఆమె విద్యాభ్యాసం చెన్నైలోనే పూర్తి చేసుకుంది. 📚🌆 మద్రాస్ యూనివర్సిటీలో క్రికెట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు ఇంజనీరింగ్ చేసిన కల్పన భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించింది. 🛰️🚀 2000 లో ఇస్రో నోటిఫికేషన్‌తో రాడార్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన కల్పన.. 2005 లో బెంగళూరులోని సాటిలైట్ సెంటర్‌ కు బదిలీ అయింది. 🛰️🛸 శాటిలైట్ భవన్‌లో సాటిలైట్ సిస్టమ్స్ ఇంజనీర్ గా విధుల్లో చేరి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చేరిన కల్పన. 🛰️🌌 ఇలా తన ఉద్యోగ ప్రస్థానంలో చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌లో భాగస్వామ్య అయింది. 👩‍🚀🌕

🏫 దీంతో కల్పన సొంత గ్రామమంతా జయహో నినాదంతో హోరెత్తింది. గ్రామమంతా ఒక్కటై కల్పన కృషిని అభినందించింది. 🌾🌱 బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంది. ప్రపంచం దేశం వైపు చూసేలా చంద్రయాన్ 3 సక్సెస్ లో కీలకంగా రాణించిన కల్పన గ్రామానికి వచ్చినపుడు ఎంతో సందడి చేసేదని జనం నోట వినిపిస్తోంది. 🌄💫 ఉన్నతమైన స్థానంలో ఉన్న గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు అండగా నిలిచింది. 🤝🏘️ తడుకు పేట పాఠశాలలో కల్పన విజయాన్ని వేడుకగా జరుపుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామానికే కల్పన కొత్త గుర్తింపు తెచ్చిందని మిఠాయిలు పంచుకుని సంబరాలు మునిగిపోయారు. 🎉🏫

🛰️🌠 కాగా, చంద్రయాన్-3 మిషన్ విజయం సాధించడంతో డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన మాట్లాడుతూ.. 🚀🌕 ప్రజ్ఞాన్ రోవర్‌‌లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై తాకిన సమయం చిరస్మరణీయమైన క్షణమని, ఎన్నో సంవత్సరాలుగా తాము చేసిన కష్టానికి విజయం లభించిందని అన్నారు. 🌌✨


bottom of page