top of page
MediaFx

కొండచిలువ, మొసలి మధ్య భీకర ఫైట్..


సరీసృపాలలో కొండచిలువలు, నీటి జంతువులలో మొసలి.. రెండూ కూడా అత్యంత శక్తివంతమైనవి. కొండచిలువలు పొడవైనవే కాదు.. భారీ బరువైనవి కూడా.. తన ఎరను పట్టుకున్నాయంటే.. దాన్ని చుట్టేసి.. ఊపిరాడకుండా చేసి.. నమిలి మింగేస్తాయి. ఇక నీటిలో మొసళ్లు చాలా బలవంతమైనవి. జంతువు ఎంత పెద్దదైనా.. దానికి ఆహారం అవ్వాల్సిందే. మరి అంతటి క్రూర జంతువులైన ఈ రెండింటి మధ్య భీకర ఫైట్ జరిగితే.. ఇటీవల మొసలి, కొండచిలువ మధ్య జరిగిన ఓ ఫైట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మొసలి, కొండచిలువ మధ్య భయంకర యుద్ధం జరిగింది. కట్ చేస్తే.. చివరికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.వైరల్ వీడియో ప్రకారం.. ఓ సరస్సులో మొసలి, భారీ కొండచిలువ రెండూ తారసపడ్డాయి. అప్పటికే విపరీతమైన ఆకలితో ఉన్న మొసలి.. కొండచిలువ రాగానే ఒక్కసారిగా ఎటాక్ చేసింది. అయితే కొండచిలువ ఏమైనా పిల్లబచ్చానా.. నేనేం తక్కువ తినలేదు అన్నట్టు.. మొసలితో భీకర యుద్దానికి దిగింది. రెండింటి మధ్య కాసేపు టఫ్ ఫైట్ జరిగింది. ఈ తరుణంలో కొండచిలువను కొరికి తినేయాలని అనుకుంది మొసలి. అయితే ఈలోపే కొండచిలువ.. మొసలిని మొత్తం చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసింది. దెబ్బకు దాని దాడికి చుక్కలు చూసిన మొసలి.. ‘ఎందుకులే.. ఈ ఫైట్ అంతా.. ‘ అనుకుంటూ కొండచిలువను వదిలిపెట్టేసింది. దీంతో కొండచిలువ కూడా ఇదిరా నా స్టామినా అంటూ అక్కడ నుంచి కామ్‌గా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

bottom of page