తెలుగు సినిమా పరిశ్రమలో మరో సంచలన సంఘటన చోటు చేసుకొన్నది. ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో దొంగతనం చేసిన కేసులో విశాఖ పోలీసులు సినీ నటిని అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ఎవరా సినీ నటి? ఏమా దొంగతనం అనే వివరాల్లోకి వెళితే.. సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లిన ప్రసాద్ కూతురుతో సౌమ్య శెట్టికి పరిచయం జరిగింది. దాంతో అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చేదని చెప్పారు. ఓ రోజు వాష్ రూమ్‌కు వెళ్తే తాళం వేసుకొనే ఆచారం మా ఇంటిలో ఉందని చెప్పడంతో ప్రసాద్ కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. అదే అదను చూసి ఆమె బంగారం చోరికి పాల్పడింది. పెళ్లికి వెళ్దామని నగల కోసం వెతకగా కనిపించకపోవడంతో ఆరా తీశారు. సౌమ్య శెట్టి దొంగిలించిందని తెలిసిన తర్వాత ఆమెపై మాకు ఫిర్యాదు చేశారు అని క్రైమ్ పోలీసులు చెప్పారు. 🕵️♀️👀