top of page
Suresh D

చియాన్ విక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు!🎥🎞️

విక్రమ్ హీరోగా చాలా కాలం క్రితమే 'ధ్రువ నచ్చత్తిరం' సినిమా రూపొందింది. ఈ సినిమాలో జాన్ - ధృవ్ అనే రెండు పేర్లతో విక్రమ్ కనిపించనున్నాడు. గౌతమ్ మీనన్ దర్శక నిర్మతగా వ్యవహరించిన సినిమా ఇది. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. 🎥🎞️

స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా ఇది. నవంబర్ 24వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా, రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఐశ్వర్య రాజేశ్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. హారీస్ జైరాజ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. మనోజ్ పరమహంస కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పార్తీబన్ .. వినాయకన్ .. రాధిక .. సిమ్రాన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 🎥🎞️

bottom of page