తేజ సజ్జా కథానాయకుడినా ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హను-మాన్’. ఈ సినిమా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. విమర్శల ప్రశంసలు అందుకుంది. నిర్మాతలకు సిరులు కురిపించింది. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ సినిమా టీమ్‌కు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కాగా ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని మూవీ లవర్స్ యాంగ్జైటీతో ఎదురుచూస్తున్నారు. మూవీ యూనిట్ మాత్రం దీని ఓటీటీ విడుదలపై క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో పోస్ట్ పెట్టారు.
‘‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ లేటవుతుంది. కావాలని చేస్తున్నది కాదు. వీలైనంత త్వరగా సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి మా టీమ్ రెస్ట్ లేకుండా వర్క్ చేసింది. మీకు ది బెస్ట్ ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. మమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్’ అని ప్రశాంత్ వర్మ మరో పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కనీసం ఎప్పుడొచ్చే అవకాశం ఉందో అయినా తెలపండి’ అని కామెంట్స్ పెడుతున్నారు.
మొదట ‘హను-మాన్’ మార్చి 2 నుంచి ‘జీ5’లో స్ట్రీమింగ్ అవుతుందని విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ అవ్వలేదు. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న వస్తుందని వార్తలు వచ్చాయి. అయినా నిరాశే ఎదురైంది. తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపించాయి. దీంతో ప్రేక్షకులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్‌తో మరోసారి నిరాస తప్పలేదు. అయితే తాజాగా ఈ వీకెండ్ మీరు ‘హను-మాన్’ వాల్ పేపర్స్‌తో సిద్దంగా ఉండండి అంటూ ప్రశాంత్ కిషోర్ మరో పోస్ట్ పెట్టడంతో.. మూవీ ఈ వారాంతంలో తప్పక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 📽🍿📺