ఇప్పటి వరకూ యాపిల్ తర్వాత సెకండ్ టాప్ పొజిషన్ లో ఉన్న శామ్సంగ్ ను బీట్ చేసింది . ఫైర్ బోల్ట్ ఏకంగా 57శాతం వృద్ధి రేటును సాధించి, శామ్సంగ్ ను అధిగమించింది.
తక్కువ ధరలో మంచి ఫీచర్లు, స్మార్ట్ లుక్ ను అందించే స్మార్ట్ వాచ్ లలో ఫైర్ బోల్ట్ ఒకటి. ఇటీవల కాలంలో పలు స్మార్ట్ వాచ్ లు తమ సత్తా చాటాయి. దీంతో గ్లోబల్ స్మార్ట్ వాచ్ మార్కెట్లో ఫైర్ బోల్ట్ టాప్ లేపింది. ఇప్పటి వరకూ యాపిల్ తర్వాత సెకండ్ టాప్ పొజిషన్ లో ఉన్న శామ్సంగ్ ను బీట్ చేసింది . ఫైర్ బోల్ట్ ఏకంగా 57శాతం వృద్ధి రేటును సాధించి, శామ్సంగ్ ను అధిగమించింది. ఈ ఉత్సాహంలో ఫైర్ బోల్ట్ మరో కొత్త స్మార్ట్ వాచ్ ను మన దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ సోలేస్ స్మార్ట్ వాచ్ పేరిట దీనిని ఆవిష్కరించింది. స్టీల్ బాడీ తోపాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఇందులో ఉంది. స్టైలిష్ డిజైన్ తో పాటు స్టన్నింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దేశీయ బ్రాండ్ అయిన ఫైర్ బోల్ట్ నుంచి వచ్చిన ఈ కొత్త స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, గోల్డ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. లాంచింగ్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1,999కే లభిస్తోంది. ఫైర్ బోల్ట్ ఈ-స్టోర్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో ఇది లభ్యమవుతోంది.