top of page
Suresh D

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 🔥 కాలి బూడిదైన సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌..

హైదరాబాద్‌‌లోని ఉప్పల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 🔥 సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 💔 కొద్ది సమయంలోనే మంటలు భారీగా చెలరేగడంతో షాపింగ్‌ మాల్‌ మొత్తం మంటలు వ్యాపించాయి.


హైదరాబాద్‌‌లోని ఉప్పల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 🔥 సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 💔 కొద్ది సమయంలోనే మంటలు భారీగా చెలరేగడంతో షాపింగ్‌ మాల్‌ మొత్తం మంటలు వ్యాపించాయి. 🚒 షాప్ మొత్తం కాలిబూడిదైనట్లు పేర్కొంటున్నారు. 💼 సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. 🚨 నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలార్పారు. 🔥 షాప్‌ క్లోజ్‌ చేశాక ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. 😢 అయితే ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లు పేర్కొంటున్నారు. 🏚️

అయితే, ప్రమాదానికి గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు. 🔍 కోట్లరూపాయల్లో ఆస్తినష్టం ఉంటుందని అంచనా వేశారు. 💸 ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటా, వేరే కారణాలేవైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ⚠️ ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 🚓 మాల్‌ సీసీఫుటేజీని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 🕵️ ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. 🚒 రద్దీ సమయంలో అగ్ని ప్రమాదం జరగితే.. భారీగా ప్రాణ నష్టం జరిగేదని.. 🔴 షాపు మూసివేసిన తర్వాత జరగడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు తెలిపారు. 🚨 యజమానులు ఫైర్ సెఫ్టీపై దృష్టిసారించాలని కోరుతున్నారు. 👁️

bottom of page