స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. హీరోగానే కాకుండా బన్నీ స్టైల్, మేనరిజం, యాటిట్యూడ్, డాన్స్‌కు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ అతి తక్కువ సమయంలోనే తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈరోజు (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఖాతాలో లెక్కలెనన్ని రికార్డులు ఉన్నాయి. అలాగే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరో బన్నీ కావడం విశేషం. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న జన్మించారు. దివంగత నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా.. గీతా ఆర్ట్స్ అధినేత.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత సినిమాతోపాటు.. కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం సినిమాల్లో బాలనటుడిగా కనిపించారు బన్నీ. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ కాంబోలో వచ్చిన డాడీ మూవీలో టీనేజ్ కుర్రాడిగా నటించారు. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న బన్నీ 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత ఏడాదే సుకుమార్ తెరకెక్కించిన ఆర్య మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించాడు. అతి తక్కువ సమయంలోనే బన్నీ ఖాతాలో అనేక రికార్డ్స్ వచ్చి చేరాయి. కేరళలో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన మొదటి తెలుగు హీరో బన్నీ. అక్కడ అల్లు అర్జున్ సినిమా వచ్చిందంటే ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. అక్కడి ఫ్యాన్స్ మ్లలు అర్జున్ అని పిలుచుకుంటారు. అలాగే ఇన్ స్టా థ్రెడ్స్ యాప్ లో ఒక్క ఫోటో పోస్ట్ తో 1 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న తొలి యాక్టర్ బన్నీ.
అలాగే ఇన్ స్టా డాక్యుమెంటరీ వీడియో చేసిన ఫస్ట్ హీరో కూడా బన్నీ కావడం విశేషం. ఈ వీడియోలో బన్నీ సెట్స్ తోపాటు బన్నీ లైఫ్ స్టైల్ కూడా చూపించారు. అలాగే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా చేసిన పుష్ప ఆడియో ఆల్బమ్ వీడియోకు యూట్యూబ్ లో 5 బిలియన్స్ వ్యూస్ దాటి సెన్సెషనల్ క్రియేట్ చేసింది. ఆ మార్క్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ ఆల్బమ్ పుష్పది కావడం విశేషం. అలాగే పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న హీరో బన్నీ. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న ఫస్ట్ హీరో. న్యూయార్క్ సిటీ గ్రాండ్ మార్షనల్ లో పాల్గొన్న ఫస్ట్ టాలీవుడ్ హీరో బన్నీనే. ప్రస్తుతం అల్లు అర్జున్ కు ఇన్ స్టాలో 25.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈరోజు బన్నీ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న పుష్ప 2 టీజర్ రిలీజ్ కానుంది.