శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు విద్యుత్ దీపకాంతులతో ఆలయం ముస్తాబైంది. ఆలయ గోపురాలు విద్యుత్ కాంతులతో ఉగాది మహోత్సవాల శోభ సంతరించుకుంది.
శ్రీశైలం మహాక్షేత్రంలో నేటి 6 నుంచి 10 వ తేదీ వరకు ఉగాది మహాత్సవాలు వైభవంగా నిర్వహించేందు దేవస్థానం అధికారులు ఈఓ పెద్దిరాజు సిబ్బంది భక్తుల ఏర్పాట్ల పనులలో నిమగ్నమయ్యారు. ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబయింది. ఆలయంలో నేటి ఉదయం యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు ఈఓ పెద్దిరాజు శ్రీకారం చుట్టనున్నారు. మొదటిరోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రకి బృంగివాహనంపై స్వామిఅమ్మవార్లు శ్రీశైలం పురవీధులలో విహారించన్నారు. మహాక్షేత్రంలో 5 రోజులపాటు జరుగనున్న ఉగాది మహోత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచి కన్నడ భక్తులు తండోపతండాలుగా భక్తిశ్రద్ధలతో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీగిరి మల్లయ్య ఆదుకో మమ్మాదుకో అంటూ నల్లమల కొండలు దాటుతూ కోరిన కోరికలు తీర్చాలంటూ ఆర్తీతో భగభగ మండే ఎండను సైతం లెక్క చేయకుండా అకలి దప్పికలు మరచి భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న భక్తులకు దేవస్థానం అధికారులు స్వచ్చంద సేవకులు అడవి మార్గంలో ఎన్నడూ చేయని విధంగా ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడా మంచినీళ్లు అల్పాహారం భోజన వసతి భక్తులకు ఏర్పాటు చేశారు. అలసిన భక్తులకు అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టి అధికారులు సేవకు భక్తుల సేవలో నిమగ్నమయ్యారు.🕉️