హీరోయిన్‌తో సరసం ఆడమంటే.. సిగ్గుతో లగెత్తాడట !
- MediaFx
- Aug 2, 2024
- 1 min read
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలను లెక్కేస్తే అందులో టాప్ ప్లేస్లో ఉంటారు మహేష్. అదే.. సిగ్గరి స్టార్ హీరోస్ లిస్ట్ తీస్తే.. అందులోనూ టాప్ 10లోనే ఉంటారు ఈ రిషి. అలాంటి ఈ హీరో.. తన డెబ్యూ ఫిల్మ్ లో .. ఓ రొమాంటిక్ సీన్ చేయడానికి తెగ సిగ్గు పడ్డారట. సరదా సరసంతో కూడిన ఓ సీన్‌లో యాక్ట్ చేయమని డైరెక్టర్ చెబితే.. నే చేయను కావాలంటే నువ్వే చేసుకో అంటూ.. సిగ్గుతో .. నవ్వుకుంటూ అక్కడి నుంచి లగెత్తారట. కానీ డైరెక్టర్ ఫోర్స్ చేసే సరికి.. నవ్వుతూనే కానిచ్చేశాడట. ఆ ముద్దు సీన్లో అదరగొట్టారట. అదంతా ఓకే కానీ.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తిన్నగా చెప్పొచ్చని అంటున్నారా? చెబుతున్నా..! ఆ సినిమానే మహేష్ ఫస్ట్ మూవీ.. రాజకుమారుడు! ఎస్! రాఘవేంద్రరావు డైరెక్షన్లో మహేష్ హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా రాజకుమారుడు. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. మహేష్ను ప్రిన్స్‌గా ఇండస్ట్రీలో నిలబెట్టింది. జులై 30 నాటికి 25 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈక్రమంలోనే ఈ సినిమా షూటింగ్ తాళూకు ఈ ఫన్నీ విషయం బయటికి వచ్చింది.