వర్షాకాలం వచ్చేసింది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. అయితే కొన్నిసార్లు వర్షంలో తడవడం కూడా కామనే. కానీ ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటున్న ఈ రోజల్లో వర్షం అనగానే వామ్మో ఫోన్ ఎలా అనే భయం రాకుండా మానదు. ప్రస్తుతం మార్కెట్లో వాటర్ ప్రూఫ్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నా. మెజారిటీ మాత్రం మాములు ఫోన్‌లనే ఉపయోగిస్తున్నారు. దీంతో వర్షంలో తడిస్తే సమస్యలు ఎదుర్కోక తప్పని పరిస్థితి.
పొరపాటున వర్షంలో ఫోన్ తడిస్తే ఇక అంతే సంగతులు. ఒకవేళ ఫోన్‌ను తిరిగి రిపేర్ చేయించినా అందులో ఏదో ఒక పార్ట్ పాడవ్వడం ఖాయం. దీనికి ప్రధాన కారణం నీటిలో తడవగానే ఫోన్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇలా అవ్వడం వల్ల ఫోన్ పూర్తిగా పాడవ్వడం లేదా కొన్ని పార్ట్స్ పాడవుతుంటాయి. అయితే ఫోన్ వర్షంలో తడిసిన వెంటనే కొన్ని టిప్స్ పాటిస్తే పాడవకుండా కాపాడుకోవచ్చు ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఫోన్ నీటిలో తడిచిన వెంటనే ముందుగా బ్యాటరీని తీసేయాలి. దీంతో పవర్ కంట్ అవుతుంది. అయితే ప్రస్తుతం నాన్ రీమవబుల్ బ్యాటరీలు వస్తున్నాయి కాబట్టి ఇది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి కనీసం ఫోన్‌ను వెంటనే ఆఫ్ చేయాలి.
* ఇక ఫోన్ తడిసిన వెంటనే బియ్యం ఉన్న ఒక డబ్బాలో వేయాలి. దీనివల్ల ఫోన్‌లో ఏదైనా తేమ ఉంటే అది రైస్ పీల్చేస్తుంది. ఇదొక బెస్ట్ టిప్‌గా చెప్పొచ్చు. ఫోన్ లోపలి పార్ట్స్‌కి చేరిన నీటిని సైతం బియ్యం పీల్చేస్తుంది.
* చాలా మంది ఫోన్ నీటిలో తడవగానే ఎయిర్ డ్రయర్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్‌లో భాగాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా గాలి తగిలే చోట ఉంచడం బెస్ట్ ఆప్షన్.
* ఇక వర్షాకాలంలో ఎప్పుడు బయటకు వెళ్లినా మీతో పాటు సిలికా జెల్ ప్యాకెట్స్‌ను ఉంచుకోవాలి. ఒకవేళ వర్షంలో ఫోన్ తడిస్తే వెంటనే ఫోన్‌ను ఒక కవర్‌లో వేసి సిలికా జెల్ ప్యాకెట్‌ను వేయాలి. ఇలా చేయడం వల్ల ఫోన్‌లోని నీటిని పీల్చేస్తుంది.
* నీటిలో తడిచిన ఫోన్‌ను కాసేపు మెల్లిగా షేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫోన్‌లోకి వెళ్లిన నీరు కొంతమేరైనా బయటకు వస్తుంది. అలాగే ఒక కాటన్ క్లాత్‌తో బాగా తుడవాలి.
* ఒకవేళ నీటిలో తడిసిన ఫోన్ ఆఫ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఛార్జింగ్ పెట్టకూడదు. దీనిల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* ఒక వర్షంలో తడిసిన తర్వాత కూడా ఫోన్ తిరిగి ప్రారంభమయినా కూడా సర్వీస్ సెంటర్‌లో చూపించడం బెటర్. ఫోన్ లోపల ఇంకా నీళ్లు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకోవచ్చు.