పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. అదంతా ఊహగానమే అని రోజా తెలిపారు. తాను ఏ పార్టీ మారడం లేదని రోజా స్పష్టం చేశారు. పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలని సూచించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరని తెలిపారు. ఎంతమంది పార్టీ వీడినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని పేర్కొన్నారు.
కొద్దిరోజులుగా ఏపీలో మహిళలపై జరిగిన ఘటనల పట్ల కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని రోజా విమర్శించారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని రోజా అన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనలో 60 రోజులు అవుతున్నా ఆ పాప శవాన్ని ఇంకా కనిపెట్టలేకపోయారని విమర్శించారు. కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ అనడం దురదృష్టకరమని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుపై కాకుండా.. మహిళలకు రక్షణ కల్పించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని హితవు పలికారు.