🗳️ తెలంగాణ పాలిటిక్స్‌లో బ్రేకింగ్ న్యూస్ ఇది. త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళుతున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, BRS పొత్తుపై ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీలో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారన్న దానిపై ఉత్కంఠ నడస్తోంది. తాజా రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
📊 ఈ ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవాలంటే మెజారిటీ లోక్‌సభ సీట్లలో గెలవడం బీఆర్‌ఎస్‌కు చాలా ముఖ్యం. రేపు జాతీయ పార్టీ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా.. అంతా నెంబర్ గేమ్‌లోనే ఉంటుంది. అందుకే, లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారు కేసీఆర్. మొన్నటి ఎన్నికల్లో మొత్తం 7 పార్లమెంట్ సెగ్మెంట్లలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బీఆర్‌ఎస్‌కు ఆధిక్యత కనిపించింది. అంటే, ఆ ఏడు పార్లమెంట్ స్థానాలపై గట్టిగా ఫోకస్ పెడితే కచ్చితంగా గెలవొచ్చనే భావనలో ఉందీ. పార్టీ ఈ రెండు పార్టీలను బాగా దెబ్బతీసింది. ఇప్పుడు ఏకంగా పొత్తు వరకు టాపిక్ వెళ్లిపోయింది. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని బీజేపీ చాలా బలంగా చెబుతోంది. కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లంతా పొత్తు ఉండబోదని క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఆకస్మాత్తుగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన సమాచారంతో మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 🤔