లోక్‌సభ బరిలో మాజీ క్రికెటర్ 🏏
- Shiva YT
- Mar 11, 2024
- 1 min read
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరుపున బెంగాల్ నుంచి పోటీ చేస్తున్న వారి పేర్లను ప్రకటించారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ బెర్హంపూర్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బెంగాల్లోని 42 ఎంపీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో పఠాన్ పేరుంది. 🗳️🏹