అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 🎥💫
తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లికించబడింది. ఆయన నటనకు తెలుగు కళ్ళామ్మ తల్లే మురిసిపోయింది. నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు, నేడు ఆ మహానటుడు శతజయంతి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి తెలుగు సినిమా కీర్తిని ఆకాశానికి చేర్చారు అక్కినేని. ఎలాంటి పాత్రైనా సరే ప్రాణం పోసి జీవించేవారు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమా చరిత్ర అంటే ముందుగా గుర్తొచ్చేదో ఎన్టీఆర్ , ఎన్నాఆర్ పేర్లే.. ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర వైపు అడుగులేశారు నాగేశ్వరరావు. తెలుగు సినిమాకు నాగేశ్వరావు ఓ మూలస్థంభం. దాదాపు 75 ఏళ్ల పాటు ఆయన సినీ రంగానికి సేవలందించారు. మరో లెజెండ్రీ యాక్టర్ ఎన్టీరామారావు తో కలిసి నాగేశ్వరావు 14 సినిమాల్లో నటించారు.అలాగే తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. చివరిగా నాగేశ్వరరావు.. కొడుకు అక్కినేని నాగార్జున, మనవడు నాగ చైతన్య తో కలిసి మనం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత నాగేశ్వరావు కన్నుమూశారు. నేడు ఆ మహానుభావుడి శతజయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన విగ్రవిష్కరణ జరిగింది.ఏయన్నార్ శత జయంతి ఉత్సవాలకు అక్కినేని కుటుంబం శ్రీకారం చుట్టింది. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించింది. ఈ వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఏయన్నార్ పంచలోహ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.🎥💫