హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్.. నైజీరియా మహిళ సహా నలుగురు అరెస్టు
- MediaFx
- Aug 26, 2024
- 1 min read
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పక్కా సమచారంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు 8.5కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, వారి నుంచి ఒక కారు, 3 సెల్ఫోన్లు సీజ్ చేశామన్నారు. రాజేంద్రనగర్‌లో..రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నైజీరియాకు చెందిన మహిళను అరెస్టు చేశామని, మరో నలుగురు పారారయ్యారని చెప్పారు. దంపతులతోపాటు మరో ముగ్గురు కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది.