📚 టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ బాసటగా నిలిచింది. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చునని ఓ ప్రకటనలో వెల్లడించింది.
విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు పల్లెవెలుగు , సిటీ ఆర్డినరీ సర్వీసులకు వర్తిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి సుమారు 16 లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనున్నాయి. అలాగే ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి.
👨🏫 మరోవైపు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు టెన్త్, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా.. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 🚀