‘గబ్బర్ సింగ్’ అంటే ఒక చరిత్ర : హరీశ్ శంకర్
- MediaFx
- Aug 31, 2024
- 1 min read
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాలలో గబ్బర్ సింగ్ ఒకటి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబోలో వచ్చిన ఈ చిత్రం 2012లో విడుదలై పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాగా దర్శకుడు హరీశ్ శంకర్ తనదైన శైలిలో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వాగ్‌నే ప్రేక్షకులు ఇప్పటికి మార్చిపోలేరు అంటే ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చిత్రం పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh Re-Release) రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించగా.. దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడాడు. ఈ వేడుకకు చిత్ర నిర్మాత బండ్ల గణేష్ హీరో. అందుకే అతడిని చివరిగా మట్లాడామని చెప్పాను. సోషల్ మీడియా, ఇంటర్‌నెట్, డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ సినిమా వచ్చి ఉంటే ఇంకా పెద్ద హిట్టు అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా చూసిన పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. అందుకే ఆ వెలితి కనిపించేది. అయితే ఆ వెలితి ఇప్పుడు రీ రిలీజ్‌తో తీరనుంది. నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన ఈ టీమ్‌కు ధన్యవాదాలు. ‘గబ్బర్ సింగ్’ చరిత్రలో ఉండిపోయే సినిమా కాదు. ‘గబ్బర్ సింగ్’ అంటేనే ఒక చరిత్ర. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా నాతో పాటు నిర్మాత బండ్ల గణేష్ జీవితాలను మార్చేసింది. ఈ సినిమా తీస్తున్నప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు. కానీ మేము ఊహించిన దానికంటే ఈ సినిమా భారీ విజయం సాధించింది. సోషల్ మీడియాలో ఒక డైలాగ్ ఉంటుంది. బాగుంటే సూపర్ హిట్ అంటారు. సూపర్ హిట్ అని టాక్ వస్తే.. అది బ్లాక్ బస్టర్ అని.. అదే బ్లాక్ బస్టర్‌ను మించి ఉంటే అది గబ్బర్ సింగ్ అవుతుందని హరీశ్ చెప్పుకోచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ క్రిటిక్ పవన్‌కల్యాణ్. డబ్బింగ్ సమయంలోనే ఆయన ఇది పక్కా బ్లాక్‌బస్టర్ అన్నారు. ఇది ఎవర్‌గ్రీన్ మూవీ అంటూ హరీశ్ తెలిపాడు.