top of page
Shiva YT

గచ్చిబౌలి టూ ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్లాన్ రద్దు.! 🚇🚫

హైదరాబాద్‌ మెట్రో రైలు అభివృద్ధి, ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. 111 జీవో పరిధిలో మెట్రో అలైన్‌మెంట్ ఎలా చేశారని సీఎం ప్రశ్నించారు.

111 జీవో పరిధిలో అభివృద్ధికి అవకాశం తక్కువన్నారు. ఓఆర్‌ఆర్‌ ద్వారా విమానాశ్రయానికి మంచి రవాణా సదుపాయం ఉన్నట్లు సీఎం తెలిపారు.

విమానాశ్రయ మెట్రోకు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌.. ప్లాన్‌-B తయారు చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. పాతబస్తీలో అధిక జనాభా దృష్ట్యా.. అక్కడ నుంచి మెట్రో అలైన్‌మెంట్‌ ఉండాలని సీఎం అన్నారు. ఎంజీబీఎస్‌, ఫలక్‌నుమా, ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో అలైన్‌మెంట్‌ ఉండాలన్నారు. పాతబస్తీ మెట్రో పనులు చేపట్టకపోవడంతో L&Tపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అలాగే L&T మెట్రో రైలు, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు రాయితీ ఒప్పందాలను పరిశీలించాలని, మూసీ వెంట రోడ్‌ కమ్‌ మెట్రో కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో 5.5 కిలోమీటర్ల మేర పూర్తి కానప్పటికీ మెట్రో రైలు కాంట్రాక్టర్‌ L&Tకి అనేక ప్రయోజనాలు అందజేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆదేశించారు. 🚆🏙️

bottom of page