top of page
Shiva YT

కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్.. అధికారికంగా ప్రకటించిన ప్రోటెం స్పీకర్ 🎤👤

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది.

స్పీకర్‌గా ఆయన పేరును కాంగ్రెస్‌ ప్రతిపాదించగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. సభలో స్పీకర్‌ ఎన్నికపై ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటన చేస్తారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. ఎల్లుండి శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు.

ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ మధ్య డైలాగ్‌ వార్‌ కొనసాగుతోంది. తొమిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని శాఖల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై శ్వేత పత్రం విడుదలకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్‌ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలపైనా అధికార పక్షాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్‌ సిద్ధమైంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని తప్పుబట్టిన బీజేపీ.. నిరసనగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ విషయంలో సభా సంప్రదాయాలను పాటించలేదని కూడా విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ బాధ్యతలు తీసుకున్నాక.. ప్రమాణస్వీకారం చేస్తామని చెప్పారు. 🎙️💼🗣️

bottom of page