top of page
MediaFx

మొసలితోనే గేమ్సా..! పుచ్చ పగిలి పోవాల్సిందే..


ప్రమాదకరమైన జంతువులతో చేసే విన్యాసాలన్నీ శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంటాయి. కానీ, కొందరు సినిమాలు, రియాల్టీ షోలను చూసి మర్చిపోతుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తమ ప్రాణాలను పణంగా పెడుతుంటారు. ఇందుకు ఉదాహరణగా జరిగిందే ఈ వీడియోలోని సంఘటన. రీల్ చేయడానికి తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు వెనుకాడని ఇలాంటివారిని చాలా మందిని సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఎక్స్‌లో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి మొసలితో స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘ఖత్రోన్ కే ఖిలాడీ’గా మారాలనే తపనతో, అటువంటి షోలలో విన్యాసాలు నిపుణుల పర్యవేక్షణలో జరుగుతాయనే విషయాన్ని బహుశా మర్చిపోయినట్టు ఉన్నాడు. అతడు ఏకంగా ఒక ప్రమాదకర మొసలి నోట్లో తల పెట్టి స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే గుండెలు గుబేల్‌ మానాల్సిందే. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా  Xలో @NeverteIImeoddలో షేర్‌ చేయబడింది. ఓ యువకుడు మొసలిపై కూర్చొని ఆ మొసలి నోటిని తెరిచి రెండు దవడలను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు అతను ఆ మొసలిపై కూర్చుని తన తలని దాని నోటిలో పెట్టాడు. కానీ మొసళ్ళు ఎంత శక్తివంతమైనవో అతనికి బహుశా తెలియదునుకుంటా. క్షణాల్లో ఆ మొసలి యువకుడి తలను గట్టిగా పట్టేసుకుంది. అక్కడున్న జనం అతన్ని కాపాడేందుకు పరుగులు తీశారు.


bottom of page