top of page
Suresh D

విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల తేదీని అనౌన్స్ చేసిన టీమ్..🎥🌟

విశ్వక్.. తన అప్‌కమింగ్ మూవీ విడుదల తేదీని ప్రకటించాడు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ తాజాగా బయటపెట్టింది.🎥🌟

మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఎక్కువగా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈసారి కమర్షియాలిటీతో పాటు మాస్‌ను కూడా యాడ్ చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ మూవీలో విశ్వక్ సేన్‌కు జోడీగా నేహా శెట్టి నటిస్తుండగా అంజలి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి పెద్దగా అప్డేట్స్ లేవు కానీ ఒక పాట మాత్రం విడుదలయ్యింది. ఆ పాటతోనే అందరినీ ఆకట్టుకున్న విశ్వక్ సేన్ తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌ను బయటపెట్టాడు.2023 డిసెంబర్ 8న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ థియేటర్లలో విడుదల కానుందని విశ్వక్ సేన్ ప్రకటించాడు. ఇప్పటికే ఈ ఏడాది ‘దాస్ కా ధమ్‌కీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ ఈ ఏడాదిలోనే రెండో మూవీకి కూడా ప్లాన్ చేయడం విశేషం.🎥🌟


bottom of page