top of page
Suresh D

దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ.. 🌟

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ తిరిగి ఆసియా కుబేరుడిగా మారిపోయారు. అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలపై సెబీ విచారణను మినహాయించి ప్రత్యేకమైన దర్యాప్తులేమీ అవసరంలేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చింది.

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ తిరిగి ఆసియా కుబేరుడిగా మారిపోయారు. అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలపై సెబీ విచారణను మినహాయించి ప్రత్యేకమైన దర్యాప్తులేమీ అవసరంలేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన సంపద గణనీయంగా పెరిగిపోయింది. దేశం లోనే అత్యంత సంపన్నుడిగా అదానీగా నిలిచారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచారు. అదానీకి అనుకూలంగా సుప్రీం తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు పెరిగాయి. శుక్రవారం ఉదయం9.30 గంటలకు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. అటు ప్రపంచ సంపన్నుల లిస్టులో అదానీ 12, అంబానీ 13వ స్థానాల్లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 📈🌏

bottom of page