top of page
MediaFx

దేశ రాజకీయాల్లో సంచలనం.. తారుమారవుతున్న ఫలితాలు..!

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. 6223 ఓట్ల వెనుకంజలో ప్రధాని మోదీ ఉన్నారు. మోదీకి పోటీగా బరిలో నిలిచిన మోదీపై కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ ఆధిక్యం. దేశీ స్టాక్ మార్కెట్లు దెబ్బకు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1900 పాయింట్లు నష్టపోయి.. కొనసాగుతుండగా.. నిఫ్టీ 600 పాయింట్లు నష్టపోయాయి. యూపీలో లోక్ సభ ఫలితాలు సంచలనంగా మారుతున్నాయి. ఎస్పీ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.. ఎస్పీ.. బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది.. ఎస్పీ 32 స్థానాల్లో, బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎన్డీయే మెజారిటీ మార్క్ దిశగా దూసుకెళ్తోంది.. ఎన్డీఏ 290 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమి 220 సీట్లలో లీడ్ లో ఉన్నాయి. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. ఎన్డీయే 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండి కూటమి 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 21 స్థానాల్లో, టీఎంసీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ 2 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు.

bottom of page