top of page
MediaFx

గర్ల్‌ఫ్రెండ్‌ కావాలా నాయనా..? హగ్‌ చేసుకుంటే రూ.11.. ముద్దు కావాలంటే 110 రూపాయలు..! ఎక్కడంటే..


కొంతమంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి వివిధ పద్ధతులను అవలంబిస్తారు. కొందరు విహారయాత్రకు వెళితే, మరికొందరు తమ ప్రియమైన వారిని కలుస్తారు. వారి నుంచి ఓదార్పుని పొందుతారు. కానీ, చైనా యువత మాత్రం తమ టెన్షన్‌ను తగ్గించుకునేందుకు స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్‌ను ఆశ్రయిస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.. పెరుగుతున్న పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల కారణంగా చైనాలో స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్స్ అనే ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇందులో ముద్దులు, హగ్గులు, డేట్స్‌కి వెళుతున్నారు. వివిధ సేవలకు వేర్వేరు ఛార్జీలు కూడా ఉన్నాయి. అమ్మాయిలందరికీ వారి సొంత ఛార్జీలు ఉన్నాయి. మీరు మీ ఎంపిక ప్రకారం ఎంచుకోవచ్చు. ఇవన్నీ సరసమైన ధరలకే ఆఫర్ చేస్తుండడంతో మగవారు ఎగబడుతున్నారు. అయితే లైంగిక సంబంధం మాత్రం కుదరదని అమ్మాయిలు చెప్పడం ఇక్కడ విశేషం. స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ అనే ట్రెండ్ గత ఏడాది ఏప్రిల్ నెలలో వెలుగులోకి వచ్చింది. కానీ, ఇటీవలి కాలంలో ఈ విధానానికి డిమాండ్, క్రేజ్ ఎక్కువైపోయిందంటున్నారు. చైనాలోని షెన్జన్ నగరంలో యువతులు హగ్స్, ముద్దులను అమ్ముకుంటున్నారు. ఒక్క కౌగిలింతకు 1 యువాన్ అంటే 11 రూపాయలు ఛార్జ్ చేస్తారట. అదే ముద్దుకైతే 10 యువాన్లు మన రూపాయల్లో అది 110లు తీసుకుంటారట. ఒకవేళ తమతో కలిసి సినిమాకు రావాలంటే మాత్రం.. వారికి అబ్బాయిలు 15 యువాన్లు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదండోయ్.. ఇంటి పనిలో కూడా సాయం చేస్తారట.. దాని సపరేట్‌ రేటు..ఇందుకోసం 20 యువాన్స్ వసూలు చేస్తారు. కలిసి తాగేందుకు 40 యువాన్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం. ముద్దులు పెట్టడం, హగ్ చేసుకోవడం, కలిసి భోజనం చేయడం, సినిమాలకు వెళ్లడం వంటివి మాత్రమే చేస్తారు. కానీ. అంతకుమించి హద్దుమీరే ప్రసక్తి లేదని ఆ అమ్మాయిలు తేల్చిచెబుతున్నారు.

ఈ ట్రెండ్ చైనాలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వింత ధోరణి గురించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్థిక అసమానతలు, మహిళల స్థితిగతుల పరంగా ఇది ఆందోళనకరమని కొందరు చెబుతుండగా, మరికొందరు ఒంటరితనాన్ని ఎదుర్కోవటానికి ఆచరణాత్మక మార్గంగా చెబుతున్నారు. ఇప్పుడు కూడా స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతా అయిపోయింది ఇప్పుడు ప్రేమ కూడా అమ్మాకానికి వచ్చేసింది అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ లోకంలో ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందోనని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

bottom of page