top of page
MediaFx

రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.!


రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్‌ అమన్‌ప్రీత్‌ సింగ్‌ డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరకడం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే ఈయన గర్ల్‌ ఫ్రెండ్.. టాలీవుడ్‌ హీరోయిన్ సీరత్ కపూర్ వైపు అందరూ అనుమానంగా చూసేలా చేస్తోంది. ఎస్ ! అమన్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్తో కొంత కాలంగా రిలేషన్లో ఉన్నాడనే టాక్ ఉంది. దానికి తోడు రకుల్, జాకీ, సీరత్, అమన్ కలిసి ఇటీవల విహారయాత్రకు కూడా వెళ్లారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు అమన్, సీరత్ కలిసి నటించిన ఆవోనా మ్యూజిక్ అల్బమ్‌లో వారిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అయితే అమాన్ తో పాటు సీరత్ కు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందా లేదా అన్నది తెలియదు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సీరత్ కపూర్ తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

bottom of page