top of page
Shiva YT

శ్రీశైలంలో వైభవంగా శ్రీగిరి ప్రదక్షిణ.. 🙏

నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాల్గుణ పౌర్ణమిని కావడంతో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. స్వామి అమ్మవార్ల మహామంగళహరతుల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగింపుగా గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమైంది. గంగాధర మండపము, ఆంకాళమ్మ ఆలయం, నందిమండపము, గంగాసదనము,బయలు వీరభద్రస్వామి ఆలయం పంచమఠాలు, మల్లమ్మ కన్నీరు పుష్కరిణి వద్దకు చేరుకొని తిరిగి నంది మండపము మీదుగా ఆలయ మహద్వారము చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది. క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు. 🚶‍♂️🙏


Related Posts

See All

‘తలైవా 171’ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన లోకేశ్‌ కనగరాజ్‌ 🎬

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) జైల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేసుకుంటూపోతున్నాడు.

bottom of page