రెబెకా హాల్, బ్రియన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కేలీ హాటిల్, అలెక్స్ ఫెర్న్స్, ఫల చెన్ ప్రధాన పాత్రల్లో, ఆడం విన్గర్డ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మాన్స్టర్ ఫిల్మ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్.
ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది.ఇండియా లో ఈ చిత్రం కి ఉన్న క్రేజ్ ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం లేటెస్ట్ గా 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. కేవలం ఇండియా లోనే ఈ రేంజ్ వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.