అడ్మిషన్లు ఎక్కడెక్కడ జరుగుతాయంటే..
స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించే గురుకుల విద్యాలయాల వివరాలను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. సంబంధిత రీజియన్ల పరిధిలోని బాలికలకు లక్సెట్టిపేట, చింతకుంట, వరంగల్ వెస్ట్, టేకులపల్లి, చేవెళ్ల, మెదక్, మహబూబ్‌నగర్ (రామిరెడ్డి గూడెం), ధర్మారం, నిడదమానూరు, వలిగొండ బాలికల విద్యాసంస్థల్లో స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయి. బాలురకు బెల్లంపల్లి, పెద్దపల్లి, వర్ధన్నపేట, తిరుమలాయపాలెం, కందుకూరు, హత్నూర యూజీ, జేపీనగర్, భిక్‌నూరు, అనుముల, భువనగిరి బాలుర కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని, అడ్మిషన్లు పొందగోరే విద్యార్ధులు సంబంధిత సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్ రోజున ఆయా గురుకుల కాలేజీలకు హాజరుకావాలని గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షిణి సూచించారు.
తెలంగాణ డీఈఈసెట్ 2024 టాపర్లు వీరే.. త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈసెట్ 2024 ఫలితాలు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17,655 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 15,150 మంది పరీక్ష రాశారు. ఈ నెల 10న జరిగిన ఈ పరీక్ష తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో జరిగింది. ఈ పరీక్షలో మొత్తం 12,032 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు పరీక్ష కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు. తాజా ఫలితాల్లో తెలుగు మాధ్యమంలో బానోతు నవీన్ 77 మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఇంగ్లిష్ మాధ్యమంలో వడ్ల వైష్ణవి 80 మార్కులతో, ఉర్దూలో సుమైయా 71 మార్కులతో ఫస్ట్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఇప్పటికే ర్యాంకు కార్డులను కూడా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.