top of page
MediaFx

మాస్ మాహారాజా అభిమానులకు గుడ్ న్యూస్..


టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్, డైరెక్టర్స్ పుట్టినరోజు లేదా ఏదైన ప్రత్యేకమైన రోజున సూపర్ హిట్ చిత్రాలను మరోసారి రిలీజ్ చేస్తున్నారు. గతంలో బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సినిమాలు ఇప్పుడు మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని అత్యంత నాణ్యమైన 4కేలో ఆ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన మూడు చిత్రాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న క్లాసికల్ సూపర్ హిట్ మురారి చిత్రాన్ని రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హిట్ మూవీని కూడా రిలీజ్ చేయనున్నారు. అదే విక్రమార్కుడు. మాస్ మాహారాజా రవితేజ, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2006లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూలై 27న ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నామని ట్వీట్ చేశారు. దీంతో మాస్ మాహారాజా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ చిత్రంలో అనుష్క శెట్టి, అజయ్, వినీత్ కుమార్, బేబీ నేహా, రాజీవ్ కనకాల, రుతిక, ఛత్రపతి శేఖర్, బ్రహానందం కీలకపాత్రలు పోషించారు.

bottom of page