పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. 🏦👩💼 లావాదేవీల్లో అవకతవకల వల్ల ఇప్పటి వరకూ డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగిన పేటీఎం త్వరలో కనుమరుగయ్యే అవకాశం ఉంది. అయితే పేటీఎం సేవలన్నీ యథాతథంగా కొనసాగుతాయని ఇప్పటికే సంస్థ ప్రకటించింది. 🎉📢 కాగా ప్రస్తుతం పేటీఎం అనే వన్97 అనే కమ్యూనికేషన్స్ అనే మాతృ సంస్థ యాజమాన్యంలో పనిచేస్తోంది. దీని ఆధ్వర్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీఎల్) నడుస్తోంది. ఇప్పుడు దీని నోడల్ ఖాతాను పీపీబీఎల్ నుంచి యాక్సిస్ బ్యాంక్ కి మార్చింది. దీంతో వినియోగదారులు తప్పనిసరిగా ఓ పనిచేయాల్సి ఉంటుంది. ప్రన్తుతం పేటీఎం వినియోగిస్తున్న వినియోగదారులు మరోసారి కేవైసీ(నో యువల్ కస్టమర్) చేయాల్సి ఉంటుంది. 🌐👏
కేవైసీ ఎందుకు..కేవైసీ అనేది భారతదేశ బ్యాంకింగ్ నిబంధనలలో కీలకమైన భాగం. ఆర్థిక నేరాల నియంత్రణతో పాటు వినియోగదారులకు రిస్క్ ఫ్రీ పర్యావరణాన్ని రూపొందించేందుకు, మనీలాండరింగ్ వంటి నేరాలను నిరోధించేందుకు ఇది అవసరం అవుతుంది. అందుకే ఆర్బీఐ ప్రతి వినియోగదారుడికి ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. బ్యాంక్ ఏదైనా మార్పు చేసినప్పుడు కూడా కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడం అవసరం. ఎందుకంటే కస్టమర్ డేటా భద్రతను, సమగ్రతను నిర్వహించడానికి ఇది చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ ఇంతకుముందు కూడా పేటిఎం వ్యాపారులు రుణదాత ద్వారా ఆన్‌బోర్డ్‌లోకి రావడానికి వ్యక్తిగత కేవైసీ చేసి ఉంటారన్నారు. అయితే ఆర్బీఐ కొత్త ఆదేశాల ప్రకారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మార్చి 15 తర్వాత ఎటువంటి బ్యాంకింగ్ సేవలను అందించదు. ఇంతకు ముందు ఫిబ్రవరి 29 వరకూ ఆ తేది ఉంది. అయితే ఈ లోపు కేవైసీ ప్రక్రియలు పూర్తి కావన్న ఉద్దేశంతో దీనిని మార్చి 15 వరకూ పొడిగించినట్లు చెప్పారు.
వినియోగదారులు ఇప్పుడు ఏం చేయాలంటే..పేటీఎం ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ చెల్లింపులను ఉపయోగించే వినియోగదారులు ఇప్పుడు మరోసారి కేవైసీని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. నిపుణులు మాత్రం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు.
నోడల్ ఖాతాలో మార్పు ఎందుకు?ఆర్బీఐ ఆదేశం ప్రకారం ఇబ్బందులు లేని నిధుల ప్రవాహం కోసం నోడల్ ఖాతాలను నిర్వహించడానికి ఆన్‌లైన్ చెల్లింపులను స్వీకరించే మధ్యవర్తులు అవసరం. నోడల్ ఖాతా ప్రత్యేక ప్రయోజన ఖాతాగా పని చేస్తుంది. పాల్గొనే బ్యాంకుల నుండి నిధులను సేకరిస్తుంది. నిర్దిష్ట వ్యాపారులకు చెల్లింపులను సులభతరం చేస్తుంది. అందుకే పీపీబీఎల్ నిర్వహణలో ఉన్న వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్(ఓసీఎల్), అలాగే పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్(పీపీఎస్ఎల్) తమ నోడల్ ఖాతాలను రద్దు చేసుకోకుండా.. యాక్సిస్ బ్యాంక్ నకు మారాయి. అందుకే వినియోగదారులు నిరంతర సేవలకు కోసం మరోసారి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.