🚜 కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు మోడీ ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున వారికి ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున జమ చేస్తోంది. ఇప్పటి వరకు 15వ విడత రైతులు అందుకోగా, ఇప్పుడు 16వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 16వ విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోగా, ఇప్పుడు ఆ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయోనన్న తేదీ ఖరారైంది. ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఈ 16వ విడత పీఎం కిసాన్ నిధులు జమ చేయనున్నారు.
📋 పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ పీఎం కిసాన్ అందుకున్న రైతులు తప్పనిసరిగా eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకోని రైతులకు ఈ 16వ విడత డబ్బులు అందవని గుర్తించుకోండి. eKYC సేవలను పీఎం కిసాన్ పోర్టల్‌లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌లలో పొందవచోచ్చు. eKYCని అమలు చేయడం వెనుక ఉన్న హేతువు ఏమిటంటే, లక్ష్యంగా చేసుకున్న లబ్ధిదారులు నేరుగా వారి ఆధార్-సీడెడ్ బ్యాంక్ ఖాతాలలో పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందేలా చేయడం. అలాగే మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించడం. 🚀