ముదల్ నీ ముదువమ్ నీ, గుడ్ నైట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తమిళ హీరోయిన్ మీతా రఘునాథ్.
ముదల్ నీ ముదువమ్ నీ, గుడ్ నైట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తమిళ హీరోయిన్ మీతా రఘునాథ్. ఈ రెండు సినిమల్లోనూ తన క్యూట్ యాక్టింగ్‌కి, ఎక్స్‌ప్రెషన్స్‌కి యూత్ ఫిదా అయిపోయారు. చేసింది రెండు సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకుంటున్న వేళ సడెన్‌గా పెళ్లి చేసుకొని షాకిచ్చింది మీతా. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా పెళ్లి చేసేసుకుంది. అయితే వరుడి వివరాలు మాత్రం బయటికి రానివ్వలేదు. కేవలం నాలుగు ఫొటోలను మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇవి చూసిన ఫ్యాన్స్ ఇంత తొందరెందుకు మీతా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే మా కోసం ఇంకొక్క సినిమాలో అలా వచ్చిపో అమ్మా మెరుపుతీగ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.✨