top of page
MediaFx

ఈ ఫీచర్లు.. మీ సెల్ ఫోన్లను కాపాడే పోలీసులు..

మనిషి జీవితాన్ని ముందుకు నడిపించే ప్రధాన సాధనంగా స్మార్ట్ ఫోన్ మారింది. ప్రతి రోజూ ప్రతి పనిలో మనకు అవసరమవుతోంది. దీనిలో మన వ్యక్తిగత సమాచారమంతా నిక్షిప్తమై ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, ఫొటోలు ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. ఇంత విలువైన స్మార్ట్ ఫోన్ ను జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ సవాలే.

సెల్ ఫోన్ దొంగతనాలు..

సెల్ ఫోన్ దొంగతనాల గురించి మనం రోజూ వింటూ ఉంటాం. పని ఒత్తిడిలో ఫోన్ ను మరిచిపోయి పొగ్గొట్టుకున్నవారు కొందరైతే, బస్సులు, ఆటోలు, రద్దీ ప్రాంతాలలో ప్రయాణించే సమయాలతో దొంగల బారినపడి విలువైన ఫోన్లు పొగొట్టుకున్న వారు మరికొందరు. ఫోన్ పోవడం అంటే కేవలం డబ్బులు పోవడం కాదు, వ్యక్తిగత సమాచారం కూడా పోగొట్టుకోవడం అని చెప్పవచ్చు.

గూగుల్ గుడ్ న్యూస్..

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ శుభవార్త చెప్పింది. దొంగల నుంచి ఫోన్లను కాపాడేందుకు యాంటీ థెఫ్ట్ ఫీచర్లను తీసుకువచ్చింది. ఇవి మీ ఫోన్లను దొంగల బారి నుంచి కాపాడతాయి. అలాగే వినియోగదారుల విలువైన డేటాను కాపాడడం కూడా దీనికి ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ (ఏఐ) ను ఉపయోగించే ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం యాంటీ థెప్ట్ ఫీచర్ల ను పరిచయం చేసింది.

బ్రెజిల్ లో దొంగతనాల జోరు..

బ్రెజిల్ దేశంలో సెల్ ఫోన్ దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ నిమిషానికి రెండు ఫోన్లు పోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. గూగుల్ తీసుకువచ్చిన కొత్త ఫీచర్లను ఆ దేశంలో పరీక్షిస్తున్నారు. దొంగతనాన్ని గుర్తించే లాక్, ఆఫ్‌లైన్ లాక్, రిమోట్ లాక్‌లు కలిగి ఉన్న ఈ యాంటీ థెఫ్ట్ ఫీచర్‌ వినియోగదారులకు చాలా ఉపయోగంగా ఉంటాయి.

యాంటీ థెఫ్ట్ ఫీచర్లు..

యాంటీ థెఫ్ట్ ఫీచర్లలో మూడు రకాల లాక్ లు ఉంటాయి. మీ ఫోన్ ను ఎవరైనా లాక్కుని పారిపోతుంటే మొదట ఫీచర్ గుర్తిస్తుంది. అంటే దొగ అసాధారణ కదలికలు పసిగడుతుంది. అతడు నడుస్తున్నా, సైక్లింగ్ చేస్తున్నా, కారులో వేగంగా వెళ్లిపోతున్నా అనుమానాస్పదంగా అనిపిస్తే అప్రమత్త అవుతుంది. వెంటనే ఫోన్ లోని ఏఐ టూల్.. స్క్రీన్ ను లాక్ చేసేస్తుంది.

రెండోది రిమోట్ లాక్ ఫీచర్.. మీరు పొగొట్టుకున్న ఫోన్ ను సురక్షితంగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. మీ ఫోన్ నంబర్ ను ఉపయోగించి మరో పరికరం ద్వారా స్క్రీన్ ను లాక్ చేయవచ్చు. రిమోట్ ను ఉపయోగించి టీవీని ఆఫ్ చేసినట్టు.. వేరే పరికరంతో మీ ఫోన్ స్క్రీన్ ను లాక్ చేయవచ్చు

మూడోది ఆఫ్ లైన్ లాక్.. ఈ ఫీచర్ కూడా ఫోన్ వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దొంగ ఎక్కువ కాలం పాటు నెట్‌వర్క్ నుంచి మీ ఫోన్‌ను డిస్‌ కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే అప్రమత్తత అవుతుంది. వేరే నెట్ వర్క్ కు మార్చినా సరే స్క్రీన్ ఆటో మేటిక్ గా లాక్ అయిపోతుంది. అలాగే ఫోన్ ను అన్ లాక్ చేయడానికి చేస్తున్నవిఫల ప్రయత్నాలను ఆఫ్ లైన్ లాక్ గమనిస్తుంది. మీ సమాచారం చోరీకి గురవకుండా కాపాడుతుంది.

bottom of page