యూజర్ల అవసరాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు.
యూజర్ల అవసరాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. 🚗 'ఫ్యూయల్ సేవింగ్' పేరుతో మ్యాప్స్‌లో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు, కెనడాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను తాజాగా భారత్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. 🌍 గూగుల్ మ్యాప్స్‌లో ఉండే ఫ్యూయల్ సేవింగ్స్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే.. మనం వెళ్లే దారిలో లైవ్ ట్రాఫిక్ అప్డేట్తో పాటు రహదారులు, ట్రాఫిక్ పరిస్థితులు, ఇంధన సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. 🚦 గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో వాహన స్పీడ్, ఫ్యుయల్ వాడకం రెండింటిని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుకూలమైన మార్గాన్ని చూపిస్తుంది. 🚗 అంతేకాకుండా ఆ రూట్ లో వెళ్లడం వల్ల ఎంత ఫ్యుయల్ పొదుపు చేయొచ్చో గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. 🛣️ ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే.. మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.. తర్వాత ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘నేవిగేషన్ సెట్టింగ్స్’ ఎంచుకుని.. కిందకు స్క్రోల్ చేయాలి. 🔄 అక్కడ కనిపించే ‘రూట్ ఆప్షన్’ అనే ట్యాబ్’లో ప్రిఫర్ ఫ్యుయల్ ఎఫిసెంట్ రూట్స్’ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. 🚗 అటుపై మీ వాహనం ఇంజిన్, ఫ్యుయల్ రకం సెలక్ట్ చేసుకోవాలి. 🚗 నేవిగేషన్ ట్యాబ్‌లోనే టోల్ ధర, స్పీడో మీటర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 🚦 వాహన వేగంతోపాటు మీరు వెళ్లే రూట్లో ఎంత టోల్ ఫీజు పే చేయాలో ఈ ఫీచర్ చూపుతుంది. ⛽✨