top of page
MediaFx

ఇలా చేస్తే రాంగ్ కాల్స్ ఇక రమ్మన్నా రావు.. 📱🚫


మన ఫోన్‌కు నిరంతరం అనేక కాల్స్ వస్తుంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, కోలిగ్స్ ఉంటారు. అయితే, కొన్నిసార్లు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తాయి. ఆ సమయంలో మనం ముఖ్యమైన పనిలో ఉంటాం. హడావుడిగా ఫోన్ లిఫ్ట్ చేస్తే అది వ్యాపార సంస్థ నుంచి కావచ్చు. దీని వల్ల మనకు చిరాకు కలుగుతుంది.

అన్‌నోన్ కాల్స్ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ లుకప్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. అన్‌నోన్ కాలర్లను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని ద్వారా యాప్ మారకుండానే కాలర్ సమాచారం తెలుసుకోవచ్చు.

పిక్సెల్ ఫోన్ వినియోగించేవారు అన్‌నోన్ కాల్స్‌ను గుర్తించడం చాలా తేలికైంది. గూగుల్ విడుదల చేసిన లుకప్ ఫీచర్ తో వారికి మరింత సౌలభ్యం లభిస్తుంది. అన్‌నోన్ కాల్స్ కు సమాచారం ఇవ్వాలా, వద్దా అనే విషయాన్ని సులువుగా నిర్ణయించుకోవచ్చు.

లుకప్ ఫీచర్ ద్వారా తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించవచ్చు. దీన్ని గతంలో జపాన్‌లో విడుదల చేశారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ పిక్సెల్ ఫోన్ల వినియోగదారులకు అందుబాటులో తీసుకువస్తున్నారు. మన కాంటాక్ట్స్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు లిస్ట్‌లో కనిపిస్తుంది. దానిని నొక్కగానే యాడ్ నంబర్, మెసేజ్, హిస్టరీ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. గూగుల్ కొత్తగా తీసుకువచ్చిన ఫీచర్ తో వీటితో పాటు నాలుగో ఆప్షన్ గా లుకప్ అని కనిపిస్తుంది. దాన్ని నొక్కగానే ఆ నంబర్ ఎవరి పేరు మీద ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా బ్యాంకులు తదితర వాణిజ్య సంస్థల నుంచి వచ్చే కాల్స్ ను గుర్తించే అవకాశం ఉంటుంది. .

గతంలో అన్‌నోన్ కాల్స్‌ను గుర్తించాలంటే వేరే యాప్ వాడాల్సి వచ్చేది. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ ఫోన్లలో వచ్చిన కొత్త ఫీచర్ అదనపు యాప్ అవసరాన్ని తొలగిస్తుంది. అన్‌నోన్ కాల్స్ వివరాలను వెంటనే గుర్తించే అవకాశం ఉండడంతో మీ విలువైన సమయం ఆదా అవుతుంది. వాటికి సమాధానం ఇవ్వాలో, లేదో నిర్ణయించుకోవచ్చు. ఆ నంబర్‌ను ట్యాబ్ చేసి, ఆ కాల్‌కు సమాధానం ఇవ్వాలా లేదా బ్లాక్ చేయాలా అనేది నిర్ణయం తీసుకోవచ్చు.

గూగుల్ తీసుకువచ్చిన లుకప్ ఫీచర్ సర్వర్ సైడ్ అప్ డేట్. అంటే ఫోన్ యాప్‌కు సంబంధించి కొత్త వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

bottom of page