గోపీచంద్ శ్రీనువైట్ల సినిమా షురూ..🎥🎞️
- Suresh D
- Sep 9, 2023
- 1 min read
మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా నూతన చిత్రం ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యింది. ఆయన 32వ చిత్రమిది . చిత్రాలయము స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా వేణు దోనెపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా నూతన చిత్రం ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యింది. ఆయన 32వ చిత్రమిది . చిత్రాలయము స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా వేణు దోనెపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అగ్ర హీరోలతో విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీను వైట్ల, కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. గోపీచంద్, శ్రీను వైట్ల కలయికలో మొదటి చిత్రమిది. ఈ రోజు పూజతో లాంఛనంగా సినిమాను ప్రారంభించారు. హీరో గోపీచంద్ మీద చిత్రీకరించిన ముహూర్తపు / తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, కృష్ణ సోదరులు - నిర్మాత ఆదిశేషగిరి రావు, రమేష్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. సినిమా విజయవంతం కావాలని, చిత్రాలయము స్టూడియోస్ సంస్థకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. 🎥🎞️