top of page
MediaFx

ప్రైవేట్ స్కూళ్ల అక్రమాలు తల్లిదండ్రులకు మేలు చేసిన ప్రభుత్వం!

ప్రైవేట్‌ స్కూళ్లలో యూనిఫారాలు, బూట్లు, బెల్టులు అమ్మకాలు చేయొద్దని కఠిన ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం. ఇప్పుడు ప్రైవేట్‌ స్కూళ్లు పుస్తకాలు, స్టేషనరీలు లాభాపేక్ష లేకుండా అమ్మాలని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.హైదరాబాద్‌ డీఈవో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలు రాష్ట్ర పాఠశాలలతోపాటు CBSE, ICSE పాఠశాలలకు కూడా వర్తిస్తాయి. పాఠశాలల ప్రాంగణాల్లో యూనిఫారాలు, షూ, బెల్ట్ విక్రయాలు చేయకూడదు. కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు వాణిజ్యేతరంగా ఉండాలి.ప్రైవేట్ పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలలో యూనిఫారాలు, షూ, బెల్ట్ అమ్మకాలు జరుగుతున్నాయా లేదో పర్యవేక్షించి, ఉల్లంఘనలు జరిగితే వెంటనే నివేదించాలని సూచించారు.

bottom of page