top of page
Suresh D

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా..!🗳️

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె పదవి వీడినట్లు సమాచారం. 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమిళనాడు నుంచి భాజపా తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళనాడు భాజపా అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించిన విషయం తెలిసిందే.🗳️



bottom of page