మీకు తెలిసిన స్టార్లను వారి చిన్ననాటి ఫోటోల ద్వారా గుర్తుపట్టడం ఎంత మజా ఉంటుందో కదా? ఇప్పుడు మీ ముందుకు ఒక చిన్ననాటి ఫోటో తీసుకువచ్చాం. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద స్టార్. అతని పేరు చెబితే అభిమానులకు పూనకాలే. సినిమా రిలీజ్ అయితే థియేటర్లలో జాతరే. కాబట్టి ఈ కుర్రాడిని గుర్తు పట్టారా?
ఇంకో సూచన ఇస్తాను: అతను తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. అతడి కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండి ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దాదాపు పది సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్నారు. తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కుర్రాడే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన పవన్, తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 1996లో "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, "బద్రి," "సుస్వాగతం," "ఖుషి" చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఈ చిత్రాలతో పవన్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం పవన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో.
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు పవన్. ఈరోజు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యింది. పవన్ తనయుడు అకీరా నందన్, కూతురు ఆద్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.