top of page

లీకైన ‘గుంటూరు కారం’ ఫస్ట్ సాంగ్ ఆడియో.. మసాలా బిర్యానీ! 🎥💫

ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేశాయి. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో.. సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. 🎥💫

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ రిలీజ్ చేయమని చాలా రోజులుగా మహేష్ బాబు అభిమానులు.. నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ను అడుగుతూనే ఉన్నారు. అయితే, థమన్ ఇచ్చిన పాట ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఆలస్యమవుతూ వస్తోంది. మొత్తానికి తొలి పాటను ఈవారంలో కచ్చితంగా విడుదల చేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్‌లో చెప్పారు. సినిమా కూడా సంక్రాంతికి కచ్చితంగా వచ్చి తీరుతుందని అన్నారు. అయితే, ఇప్పుడు ఆ పాట లీకైందని అంటున్నారు. ఈ మేరకు చిన్న ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మసాలా బిర్యానీ’ అంటూ సాగే ఆ క్లిప్ క్యాచీగా ఉంది. అంతేకాదు, ఇది థమన్ స్టైల్లోనే ఉంది. ఆ క్లిప్ వింటుంటే నిజమే అనిపిస్తోంది. ‘ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్నా చొక్కా పైగుండీ.. ఎగబడి ముందరికే వెళ్లిపోతాది నేనెక్కిన బండి.. మసాలా బిర్యానీ’ అంటూ ఈ క్లిప్‌లో రిలిక్స్ వినిపస్తున్నాయి.ఈ క్లిప్ ప్రస్తుతం ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది. గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అని వైరల్ చేస్తున్నారు.



 
 
bottom of page