top of page
Suresh D

గుంటూరు కారం ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ.. ఒక ఫైట్‌లో కృష్ణని కూడా..🎥🎉

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’ ఈ సంక్రాంతి పండక్కి ఘాటు చూపించేందుకు సిద్దమవుతుంది. జనవరి 12న థియేటర్స్ కి వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’ ఈ సంక్రాంతి పండక్కి ఘాటు చూపించేందుకు సిద్దమవుతుంది. జనవరి 12న థియేటర్స్ కి వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో అభిమానులు.. ట్రైలర్ రిలీజ్ గురించి ప్రశ్నిస్తున్నారు.

తాజాగా నిర్మాత నాగవంశీ.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, మూవీ ఎలా ఉండబోతుంది, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయాలు పై అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ కి సంబంధించి BGM అంతా ఫైనల్ అయ్యిపోయిందట. ఇక సెకండ్ హాఫ్ బ్యాలన్స్ ఉందని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ గురించి తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. జనవరి 6న ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. 

ఇక సినిమాలోని విషయాలకు వస్తే.. ఇంటర్వెల్ సీన్ లో మహేష్ బాబు అందర్నీ ఎమోషనల్ చేసేస్తారని పేర్కొన్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ లో సూపర్ స్టార్ కృష్ణని కూడా మీరు ఫీల్ అవుతారని వెల్లడించారు. ఇక సినిమాలో లాస్ట్ 45 నిమిషాలు.. ఫైట్స్, సాంగ్స్, ఎమోషన్స్ తో సూపర్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే మంచి కామెడీ కూడా ఉంటుందని పేర్కొన్నారు.

నాగవంశీ చెప్పిన విషయాలతో మూవీ పై మరింత హైప్ క్రియేట్ అవుతుంది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 6న నిర్వహించబోతున్నారట. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారట. కాలిఫోర్నియా సినీ లాంజ్ ఫ్రీమాంట్ సెవెన్ సినిమాస్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.🎥🎉

bottom of page