top of page
Suresh D

‘గుంటూరు కారం’ ప్ర‌మోష‌న్స్.. లుంగీ క‌ట్టుకుని ఊర మాస్ లుక్‌లో మహేష్🎉🎞️

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ . శ్రీలీల, మీనాక్షి చౌద‌రిలు కథానాయికలుగా న‌టిస్తుండ‌గా.. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’       శ్రీలీల, మీనాక్షి చౌద‌రిలు కథానాయికలుగా న‌టిస్తుండ‌గా.. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతికి విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒక‌టి. మహేశ్‌ – త్రివిక్రమ్‌ శైలి మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి దమ్‌ మసాలా బిర్యానీ, ఓ మై బేబీ సాంగ్‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. ఈ పాటలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నాయి.

ఇదిలావుంటే.. విడుద‌ల తేదీ దగ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో చిత్రబృందం ప్ర‌మోష‌న్స్ వేగం పెంచింది. ఇందులో భాగంగా.. టేబుల్ మీద మహేష్ బీడీ కాలుస్తూ ఉన్న ఫొటోతో పాటు లుంగీ క‌ట్టుకుని ఊర మాస్ లుక్‌లో ఉన్న మహేష్ ఫొటోల‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ లుక్స్ సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది.🎥✨

bottom of page