top of page

హీరోయిన్‌కు లేని బాధ మీకెందుకు..హరీష్ శంకర్

MediaFx

తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంటాయి. రవితేజ, శ్రీలీల మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయినా తర్వాత అందరూ నోరు మూసుకున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమా గురించి కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది మిస్టర్ బచ్చన్ సినిమాలోని రవితేజ,  భాగ్య శ్రీ బోర్సే ఏజ్ గ్యాప్ గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారిద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ క్లియర్‌గా కనిపిస్తుందని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. దీని పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. మిస్టర్‌ బచ్చన్‌ అనే సినిమాలో రవితేజ- భాగ్య శ్రీ బోర్సే కేవలం నటిస్తున్నారని ముందుగా అందరు గుర్తుపెట్టుకోవాలి అని హరీష్ అన్నారు. ఏజ్‌ గ్యాప్‌ అనేది ఇప్పటికే కొన్ని వందల సినిమాలు వచ్చాయి. చాలా సినిమాల్లో జరిగింది. ఎప్పుడైన ఒక నటుడు కానీ నటి కానీ ఏజ్ ను బట్టి నటించారు. సినిమాలో పాత్రను బట్టి నటిస్తారు అంతే.. ఒకొక్కసారి హీరోయిన్స్ యంగ్ గా 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తారు.. అలాగే మరో సినిమాలో 50 ఏళ్ల వయసున్న పెద్దావిడగా కనిపిస్తారు. దాన్ని స్క్రీన్ ఏజ్ అంటారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించారో అందరికి తెలుసు అని అన్నారు హరీష్ శంకర్. అలాగే రవితేజ ధమాకా సినిమాను కూడా గుర్తుచేశారు హరీష్. అలాగే సినిమాలో నటించిన హీరోయిన్‍కు ఎలాంటి సమస్య లేదు. ఆమెకు ప్రాబ్లమ్ కానీ ఏజ్‌ గ్యాప్‌ మీకెందుకు అంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చాడు.



bottom of page