top of page
MediaFx

జఫ్రానీ ఛాయ్‌ ను ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా ?? రేటెంతో తెలుసా ??


వర్షాలతో వాతావరణం బాగా చల్లబడిపోయింది. ఇలాంటి వాతావరణంలో వేడి వేడి ఛాయ్ తాగితే భలే ఉంటుంది. అందుకే చాలామంది టీ దుకాణాలను ఆశ్రయిస్తుంటారు. రకరకాల చాయ్‌లకు హైదరాబాద్‌ ఫేమస్‌. అల్లం టీ నుంచి ఇరానీ చాయ్‌ వరకూ ఎన్నో రకాల స్పెషల్‌ టీ లు ఇక్కడ దొరుకుతాయి. ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు టీ తాగుతుంటారు. అయితే అందరూ ఇష్టపడే టీ.. ఇరానీ టీ.. ఇప్పుడు దీని ప్లేస్లో జఫ్రానీ టీ వచ్చింది. ఈ కొత్తరకం టీని టేస్ట్‌ చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేకంగా మట్టి పాత్రల్లో అందించే ఈ టీని ఆస్వాదించేందుకు టీ ప్రియులు మొగ్గుచూపుతున్నారు. ఆరోగ్యంతో పాటు ఉత్సాహాన్ని ఇచ్చే ఈ టీని ప్రత్యేకంగా తయారు చేస్తారు. మామూలుగా టీ అంటే డికాక్షన్‌లో పాలు వేసి మరిగిస్తారు. కానీ ఈ జఫ్రానీ టీ అంటే పాలను ప్రత్యేకంగా మరిగిస్తారు. అలాగే డికాక్షన్‌ కూడా సెపరేట్‌గా చేస్తారు. టీ తాగేందుకు వచ్చిన వారికి అప్పటికప్పుడు చక్కగా డిక్షాక్షన్‌, బాగా మరిగించిన పాలు కలిపి అందులో కుంకుమ పువ్వు వేసి మట్టి పాత్రలో అందిస్తారు. ఇటీవలి కాలంలో కుంకుమ పువ్వుతో చేసే జఫ్రానీ ఛాయ్‌ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ టీ ధర కూడా సాధారణ టీ కంటే కాస్త ఎక్కువగానే ఉంటోంది. ఒక టీ దాదాపు 30 రూపాయలకు పైగానే ఉంటుంది. కొన్ని ప్రముఖ హోటళ్లలో అయితే ధర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వందల్లోనే ఉంటోంది. వాడే కుంకుమ పువ్వులోనూ తేడా కనిపిస్తోంది. భారీ వర్షానికి కొత్త కొత్త రుచులు కోరుకునే టీ ప్రియులకు ఈ జఫ్రానీ టీ తెగ నచ్చేస్తోంది. ఓ వైపు వర్షం.. వేడి వేడిగా ఆస్వాదించే టీ చేతిలో ఉంటే ఆ మజానే వేరంటున్నారు నగర వాసులు. ఏది ఏమైనా వర్షాల కారణంగా నగర వాసులకు ఈ టీ ఎంజాయ్‌మెంట్‌ ను ఇస్తోంది. అటు వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది.

bottom of page