top of page
Shiva YT

‘దానిమ్మ ఫేస్‌ ప్యాక్‌.. ఎప్పుడైనా ట్రై చేశారా?

‘దానిమ్మ చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో రుచికి కూడా అంతే తీపిగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దానిమ్మ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దానిమ్మ ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మ మచ్చలను పోగొట్టి చర్మాన్ని మృదువుగా, అందంగా మార్చడంలో సహాయపడుతుంది.’

‘మీరు సరైన మార్గంలో దానిమ్మను వినియోగించినట్లైతే మచ్చలేని అందం మీ సొంతం అవుతుంది. ఇంట్లోనే సులువుగా దానిమ్మతో ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.. దానిమ్మ విత్తనాలను పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఒక గిన్నె పెరుగు తీసుకోవాలి. దానికి దానిమ్మ రసం జోడించాలి.’

‘బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఈ మాస్క్‌ చర్మంపై మచ్చలన్నీ పోగొడుతుంది. అదేవిధంగా దానిమ్మ, తేనె ఫేస్ ప్యాక్ కూడా ఉపయోగించవచ్చు. దానిమ్మ రసంలో తేనె కలుపుకుని ముఖానికి అప్లై చేస్తే ఫలితం ఉంటుంది.’

‘దానిమ్మను స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఓట్స్ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి దానిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమంతో బాగా కలుపుకుని చర్మానికి అప్లై చేయాలి. తర్వాత చేతితో మృదువుగా స్క్రబ్ చేయాలి. ఫలితంగా మృతకణాలు తొలగిపోతాయి.’

‘దానిమ్మ, కలబందను కలిపి ఉపయోగించడం వల్ల టాన్ సమస్య పరిష్కారం అవుతుంది. ఎండ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, కలబంద, దానిమ్మ ఫేస్ ప్యాక్ ముఖానికి వేసుకోవాలి. ఇది ఎండ వలన ఏర్పడిన నల్లని ట్యాన్‌ను తొలగిస్తుంది.’ 😊🌿✨

bottom of page