🛫 ఫ్రాన్స్ లోని టౌలోసీ వర్క్‌షాప్‌లో కొత్త లోగో, సరికొత్త డిజైన్‌తో రూపుదిద్దుకుంటున్న ఏ350 విమానం ఫొటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ఎయిర్‌లైన్ ఈ సంవత్సరం ప్రారంభంలో కొత్త ఎరుపు - వంకాయ - బంగారు రంగులతో కొత్త లోగో 'ది విస్టా'తో రీబ్రాండ్ చేయబడింది.
✈️ ఎయిర్ ఇండియాలో పాత విమానాలన్నింటినీ రీఫర్బిష్ చేసేందుకు భారీగా ఖర్చు పెడుతోంది కంపెనీ. దాదాపు 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. గ్రౌండ్ లెవెల్ నుంచి పైస్థాయి వరకూ అన్ని డిపార్ట్‌మెంట్‌లలోనూ సంస్కరణలు చేపట్టాలన్నదే సంస్థ లక్ష్యంగా పేర్కొంది. 🌐
🖌️ ఈ మార్పు కొత్త బ్రాండ్ ఎయిర్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిథులకు సేవలందించే ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా మార్చాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొంది. ప్రపంచ వేదికపై కొత్త ఎయిర్ ఇండియా భారతదేశానికి గర్వంగా నిలబెట్టాలన్నదే తమ ఆశయం అని ఎయిర్ ఇండియా గతంలోనే ప్రకటించింది. 🇮🇳
📅 2025 నాటికి అన్ని ఎయిర్ ఇండియా విమానాలు కొత్త లోగోతో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్, బోయింగ్‌లతో బహుళ-బిలియన్ డాలర్ల విమాన ఒప్పందాలపై సంతకం చేసిన కొన్ని నెలల తర్వాత ఆగస్టులో కొత్త లోగోను ప్రకటించింది ఎయిర్ ఇండియా.
🛫 హెరిటేజ్‌తో పూర్తిగా రూపాంతరం చెందేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నిస్తోందని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు తెలిపారు. కొత్త లైవరీ, డిజైన్‌లో ముదురు ఎరుపు, వంకాయ, బంగారు రంగుల హైలైట్‌లు, వీల్-ప్రేరేపిత నమూనాతో కూడిన ప్యాలెట్ ఉన్నాయి. 🎨