పోషక విలువలతో కూడిన కూరగాయలను నిత్యం తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో తలెత్తే అనారోగ్యాల ముప్పును నివారించవచ్చు. ఇక వర్షాకాలంలో కాకర కాయ శరీరానికి ఎంతో మంచిది. కాకర ఇమ్యూనిటీని బలోపేతం చేయడంతో పాటు కాలేయం శుభ్రపరిచి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇక ఈ సీజన్‌లో సొరకాయ కూడా ఎంతో మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
సులభంగా జీర్ణం కావడంతో పాటు జీర్ణ సమస్యలు దరిచేరకుండా ఉంచడంతో పాటు ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. మరోవైపు సొరకాయ తరచూ తీసుకోవడంతో మలబద్ధకం నివారించి అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలు దరిచేరవు. ఇక వర్షాకాలంలో తీసుకోవాల్సిన కూరగాయలను పరిశీలిస్తే.. కాకరకాయ సొరకాయ బీరకాయ పాలకూర మెంతికూర మునగ క్యారట్ బీట్రూట్ గుమ్మడి కాయ బెండకాయ