🍎 ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది రోజూ తీసుకునే ఫ్రూట్స్‌లో యాపిల్ కూడా అగ్రస్థానంలో ఉంటుంది. యాపిల్ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉండటమే దీనికి కారణం.
అందుకే మంచి ఆరోగ్యం కోసం రోజూ యాపిల్ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. సహజంగా యాపిల్ 3-4 రంగుల్లో మనం చూసే ఉంటాం.. అవి ఎరుపు, ఆకుపచ్చ, బంగారు/పసుపు రంగుల్లోని యాపిల్స్. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే యాపిల్‌ను చిన్నారులు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే మనకు తెలియని, ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇతర రంగుల్లో కూడా యాపిల్ పండ్లు ఉంటాయి. మనకు అవి అందుబాటులో లేకపోయినా.. ఇతర దేశాల్లో లభిస్తుంటాయి. అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప.. మన దేశంలో అవి కనిపించవు.
🍇 ఇలా బ్లాక్ యాపిల్స్ కూడా లభిస్తాయంటే మనకు ఆశ్చర్యం కలిగించడం సహజమే. పోషక విలువలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. యాపిల్ వరైటీల్లో బ్లాక్ డైమండ్ యాపిల్ చాలా ప్రత్యేకమైనది. వీటిని అబ్సిడియన్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇవి చాలా ఖరీదైనవి కూడా.. టిబెట్ పర్వత ప్రాంతాల్లో వీటిని సాగుచేస్తారు. వీటికి పైన నల్ల రంగులో ఉన్నా.. లోపలి భాగం మాత్రం సాధారణ యాపిల్‌లానే తెల్లగా ఉంటుంది. 🍇